Header Banner

ప్లాట్ కొనుగోలుదారులకు భారీ ఊరట..! రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించిన ఏపీ ప్రభుత్వం!

  Thu May 01, 2025 08:43        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. బంపరాఫర్ ప్రకటించింది. రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ప్రభుత్వ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల)లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ఫీజులను ప్రభుత్వం తగ్గించింది. మధ్య తరగతి ప్రజలకు భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.. దీని ప్రకారం ఒకే ప్లాట్‌ను రెండు రకాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త విధానం ప్రకారం ప్లాట్ విలువను రెండు భాగాలుగా విభజిస్తారు. బేస్ ధర కింద 60%, అభివృద్ధి ఛార్జీల కింద 40% గా లెక్కిస్తారు. 60% మొత్తంపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. మిగిలిన 40% మొత్తంపై 0.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే ప్లాట్‌ రెండు దస్తావేజుల కింద రెండు రకాల ఫీజులతో రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వెసులుబాటు ఉంటుంది అని ప్రభుత్వం తెలిపింది.

గతంలో ప్లాట్ మొత్తం విలువపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఉండేది. ఇది మధ్య తరగతి ప్రజలకు చాలా భారంగా ఉండేది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (CRDA), విశాఖ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌లను ప్రారంభించారు. 'మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), విశాఖ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ తదితర పరిధిల్లో ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లు ప్రారంభించారు' అని అధికారులు తెలిపారు. ఈ టౌన్‌షిప్‌లలో ఇప్పటికే లాటరీ ద్వారా ప్రజలకు ప్లాట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో(ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు), సీఆర్‌డీఏ ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలపై భారం తగ్గింది. ఈ మేరకు అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఊరట దక్కనుందని భావిస్తున్నారు.


ఇది కూడా చదవండి: ఏపీకి రూ.172 కోట్లతో మరో కొత్త మాల్! ఆ నగరంలో ఫిక్స్..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APGovernment #PlotBuyersRelief #RegistrationFeeCut #SmartTownships #MiddleClassSupport #NTRTownship